Spice Jet Bumper Offer: సామాన్యులకు మధ్య తరగతి వారికి రైలు ప్రయాణం ఒక గొప్ప విషయం. అలాంటి వారికి విమాన ప్రయాణం అందని ద్రాక్ష అనడంలో సందేహం లేదు. వేల రూపాయలు ఖర్చు చేసి విమాన ప్రయాణం చేయాలని కోరిక ఉన్నా కూడా వారి స్థాయి అందుకు సహకరించదు. సామాన్యులు ముఖ్యంగా మధ్య తరగతి వారు విమానం ఎక్కాలి అనేది ఒక డ్రీమ్‌ గా పెట్టుకుంటారు. కానీ వారు జీవితంలో ఒక్కసారి కూడా విమానం ఎక్కలేము అని ఆశలు వదిలేసుకుంటారు. అలాంటి వారి కోసం స్పైస్‌ జెట్‌ అద్భుతమైన ప్రకటన చేసింది. వారు ఇస్తున్న ఆఫర్‌ తో కేవలం 1515 రూపాయలకే దేశీయ విమానంను ఎక్కవచ్చు. ఈ గ్రూప్‌ కి చెందిన విమానంలో ప్రత్యేక ఆఫర్‌ గా తక్కువ మొత్తంకు టికెట్‌ ను ఇవ్వబోతున్నట్లుగా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్పెషల్‌ ఇన్‌ క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్‌ అంటూ 2023 లో భాగంగా ముంబై - గోవా, జమ్మూ-కశ్మీర్‌, గోవా - ముంబై, గౌహతి - బాగ్డోగ్రా, చెన్నై - హైదరాబాద తో పాటు మరి కొన్ని రూట్లలో ఈ ఆఫర్ ను అందుబాటులో ఉంచినట్లుగా సంస్థ అధికారికంగా ప్రకటించింది. రూ.1,515 విమాన టికెట్‌ తో ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్‌ ను వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున బుకింగ్స్ జరుగుతున్నాయి. పని ఉన్నా లేకున్నా కూడా నాలుగు వేల రూపాయలతో  విమానంలో రెండు సార్లు ఎక్కి తిరగవచ్చు అనే  ఉద్దేశ్యంతో కొందరు ఈ బుకింగ్స్ కు సిద్ధం అవుతున్నారు అంటూ మార్కెట్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇలాంటి ఆఫర్లను అప్పుడప్పుడు పెట్టడం ద్వారా సామాన్యుల్లో కొందరు అయినా విమాన ప్రయాణం కలను నెరవేర్చుకున్న వారు అవుతారు. 


Also Read: Vijayawada: విజయవాడలో 144 సెక్షన్ అమలు.. 3 వేల మందితో భారీ బందోబస్తు  


గతంలో కూడా కొన్ని ఎయిర్‌ వేస్ సంస్థలు ఇలాంటి ఆఫర్లను ప్రకటించాయి. కానీ ఈ ఆఫర్‌ వాటన్నింటితో పోల్చితే ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. దేశంలోని పలు విమానాశ్రాయాల్లో స్పైస్‌ జెట్‌ విమాన సర్వీసులు అందిస్తోంది. కనుక వాటిల్లో ప్రయాణించి ఈ ఆఫర్‌ ను సద్వినియోగం చేసుకోవచ్చు అంటూ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఆగస్టు 14 నుండి ప్రారంభం అయిన ఈ బంపర్ ఆఫర్ ను ఆగస్టు 20వ తారీకు వరకు కొనసాగించబోతున్నట్లుగా సంస్థ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. తక్కువ ధరలో ఫ్లైట్ ఎక్కాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ఆఫర్‌. 2024 మార్చి 30 వరకు ఈ ఆఫర్ టికెట్లతో ప్రయాణం చేయవచ్చు.


Also Read: Virat Kohli: ఈ పరుగుల దాహం తీరనిది.. విరాట్ కోహ్లీ జిమ్ వీడియో చూశారా..!   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి